ఎప్పుడైనా ఐపీఎల్లో ముంబై ఫస్టాఫ్ ఆడే ఆట ఓ ఎత్తు అయితే..సెకండాఫ్ ఆడే ఆట మరో ఎత్తు. అలా తమకున్న ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే సెకండాఫ్ కి వచ్చేసరికి జోరు పెంచేసింది MI. ఇప్పటికే సీజన్ లో 5 విజయాలు సాధించి 10పాయింట్లు గెలిచిన ముంబై...అన్నే విజయాలు సాధించి అన్నే పాయింట్లు గెలిచిన లక్నోతో సమరానికి ఈరోజు సిద్ధమైంది. పాయింట్స్ టేబుల్ లో ఐదు ఆరు స్థానాల్లో MI, లక్నో జట్లు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవటం కోసం తీవ్రంగా శ్రమిస్తాయి ఈ రోజు. బలాబలాలు చూసుకుంటే ముంబైకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావటం కొండంత అండ. వరుసగా రెండు మ్యాచుల్లో 70+ ప్లస్ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ..తన బీస్ట్ ఫామ్ ను కంటిన్యూ చేయాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటోంది. రికెల్టన్ అంతగా జోరు చూపించకున్నా సూర్య కుమార్ యాదవ్, నమన్ ధీర్, విల్ జాక్స్ మంచి టచ్ లో ఉన్నారు. పాండ్యా కూడా ఓ చేయేస్తే ముంబైకి తిరుగు ఉండదు. ఇక బౌలింగ్ ఎలాగో బుమ్రా, బౌల్ట్ కాంబోతో దూసుకుపోతోంది. శాంటర్న్, విఘ్నేశ్ పుత్తూరు కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యింది. ఇటు LSG చూస్తే 27కోట్లు పోసి కొనుక్కున్న పంత్ ఆడకపోవటమే వాళ్లకు బాధ. కానీ టాప్ 3 బ్యాటర్లైన మార్ క్రమ్, మిచ్ మార్ష్, పూరన్ ల బ్యాటింగే ఈ సీజన్ లో LSG ని ఇక్కడివరకూ తీసుకు వచ్చింది. అవసరమైనప్పుడు ఆడటానికి మిల్లర్, సమద్ ఎలాగో ఉన్నారు. బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ జోరు చూపిస్తుంటే..స్పిన్ సంగతి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ బాగానే చూసుకుంటున్నారు. చూడాలి ఈ రోజు మ్యాచ్ లో ఏ టీమ్ ఆరో విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్ లో ముందు అడుగు వేస్తుందో.